సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:49 PM
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చైర్మన్ రాహుల్ సింగ్‌కు పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు జారీ చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చైర్మన్ రాహుల్ సింగ్‌కు పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు జారీ చేసింది. క్లాస్ 12 పరీక్షల్లో అమలు చేసిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం (CBSE Chief Summoned).
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జూన్ 2న సమావేశం కానుంది. ఈ సమావేశానికి స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్‌తో పాటు సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్ హాజరుకావాలని కమిటీ ఆదేశించింది. ఈ సమావేశంలో క్లాస్ 12 బోర్డు పరీక్షల్లో అమలు చేసిన ఓఎస్‌ఎమ్ విధానం, ఫలితాల అనంతరం విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు, రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులపై చర్చించనున్నారు (Parliamentary Panel).
అలాగే 9, 10 తరగతుల్లో మూడు భాషల విధానం అమలుపై కూడా కమిటీ వివరణ కోరనుంది. జాతీయ విద్యా విధానం (NEP 2020)లో భాగంగా సీబీఎస్‌ఈ ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, కొన్ని రాష్ట్రాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..