Share News

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:30 AM

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌, వెరిఫికేషన్‌ ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీబీఎస్ఈ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 21: సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌, వెరిఫికేషన్‌ ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీబీఎస్ఈ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. తొలుత ప్రకటించిన ఫలితాలపై సంతృప్తి చెందని చాలా మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేశారు. ఓఎస్ఎం విధానంలో లోటుపాట్లు చోటుచేసుకున్నాయని, తమ జవాబు పత్రాల బదులు వేరేవారి పత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్లో పెట్టారని పలువురు అభ్యర్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో 87 శాతం ఫలితాలను ప్రస్తుతం విడుదల చేసినట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. మిగిలిన వారి ఫలితాలను దశల వారీగా ప్రకటిస్తామని తెలిపింది. మొత్తం ఫలితాల విడుదల త్వరగానే పూర్తవుతుందని పేర్కొంది. విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది.

Updated Date - Jun 22 , 2026 | 04:30 AM