క్యాన్సర్‌కు చూయింగ్‌గమ్ చికిత్స
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:00 AM
పిల్లలు చూయింగ్‌గమ్ నములుతుంటే.. అలవాటు మానుకోమంటూ పెద్దలు మందలిస్తుంటారు. అమెరికా వైద్యులు మాత్రం చూయింగ్‌గమ్‌తో ఏకంగా క్యాన్సర్‌కే చికిత్సను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
హ్యూమన్ పాపిలోమా వైర్‌సపై సమర్థంగా పనిచేస్తున్న చూయింగ్‌గమ్ .. ఓ రకం బీన్స్ పొడితో తయారీ
పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలు
వాషింగ్టన్, నవంబరు 16: పిల్లలు చూయింగ్‌గమ్ నములుతుంటే.. అలవాటు మానుకోమంటూ పెద్దలు మందలిస్తుంటారు. అమెరికా వైద్యులు మాత్రం చూయింగ్‌గమ్‌తో ఏకంగా క్యాన్సర్‌కే చికిత్సను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. పలు రకాల క్యాన్సర్లకు కారణమయ్యే ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’ (హెచ్‌పీవీ)ను లాబ్‌లాబ్ బీన్స్ పొడితో తయారుచేసే చూయింగ్‌గమ్‌లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని గుర్తించారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా ఈ చూయింగ్‌గమ్‌లను తయారుచేసి క్యాన్సర్ పేషంట్లపై పరీక్షించి చూశారు. తల, మెడ, వెన్నెముక, మలద్వారం వంటి పలు రకాల క్యాన్సర్లకు హెచ్‌పీవీ వైరస్ కారణమవుతోంది. హెచ్‌పీవీ గణనీయంగా ఉన్న క్యాన్సర్ పేషంట్లకు రెండు రకాల లాబ్‌లాబ్ బీన్స్ చూయింగ్‌గమ్‌లను అందించి, కొంతకాలమైన తర్వాత పరీక్షిస్తే.. వారి లాలాద్రవంలో 93 శాతం మేర వైరస్ తగ్గిపోయినట్లు వెల్లడైంది. క్యాన్సర్‌కు కారణమవుతున్న రెండు రకాల బ్యాక్టీరియాను కూడా కేవలం ఒకే ఒక చికిత్సలో ఈ చూయింగ్‌గమ్‌లు 99 శాతం మేర నిర్మూలించినట్లు తెలిసింది. లాబ్‌లాబ్ బీన్స్ పొడిలోని ఎఫ్‌ఎల్‌టీ3 రిసెప్టర్ హెచ్‌పీవీని లక్ష్యంగా చేసుకుంటుందని, పెప్టైడ్ ప్రొటీగ్రీన్-1 నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కొంటుందని తేలింది. ఈ నేపథ్యంలో, ఈ చూయింగ్‌గమ్‌ల చికిత్సపై పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలకు సిద్ధమవుతున్నారు.