దిగిరానున్న క్యాన్సర్ మందుల ధరలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:18 AM
క్యాన్సర్ మందుల ధరల తగ్గింపు అంశంలో కీలక అడుగు పడింది. నాన్ షెడ్యూల్(ధరల నియంత్రణ పరిధిలో లేని) విభాగంలోని 137 రకాల క్యాన్సర్ మందుల ఎంఆర్పీపై..
న్యూఢిల్లీ, అక్టోబరు 17: క్యాన్సర్ మందుల ధరల తగ్గింపు అంశంలో కీలక అడుగు పడింది. నాన్ షెడ్యూల్(ధరల నియంత్రణ పరిధిలో లేని) విభాగంలోని 137 రకాల క్యాన్సర్ మందుల ఎంఆర్పీపై ట్రేడ్ మార్జిన్ను 30 శాతానికి కేంద్రప్రభుత్వం పరిమితం చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ శనివారం వెలువడింది. దీని ప్రకారం కొత్త ధరలు నవంబరు 9 నుంచి అమలులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో ఆయా మందుల రిటైల్ ధరలు ప్రస్తుతమున్న వాటితో పోలిస్తే సుమారు 70 శాతం వరకు తగ్గనున్నాయి.