ఇక చకచకా కెనడా వీసాలు!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:05 AM
భారతీయ సందర్శకులు, విద్యార్థులు, ఉద్యోగులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ విభాగం ...
భారతీయులకు తగ్గిన నిరీక్షణ గడువు
న్యూఢిల్లీ, మార్చి 12: భారతీయ సందర్శకులు, విద్యార్థులు, ఉద్యోగులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ విభాగం (ఐఆర్‌సీసీ) గణాంకాల ప్రకారం.. భారతీయుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగవంతమైంది. దీంతో నిరీక్షణ సమయాలు బాగా తగ్గాయి. బుధవారం ఐఆర్‌సీసీ విడుదల చేసిన వీసా, ఇమిగ్రేషన్ టైమ్‌లైన్ల ప్రకారం... భారతీయులకు విజిటర్ వీసా ఇప్పుడు 57 రోజుల్లో జారీ అవుతున్నాయి. భారత్ నుంచి డిపెండెంట్ చైల్డ్ స్పాన్సర్‌షిప్ దరఖాస్తు ప్రాసెసింగ్‌కు గతంలో 16 నెలలు పడుతుండగా ఇప్పుడది 8 నెలలకు తగ్గింది. భారత్ నుంచి వచ్చే వర్క్ పర్మిట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయం స్పల్పంగా మెరుగుపడగా, నిరీక్షణ గడువు 8వారాల నుంచి 7వారాలకు తగ్గింది. భారతీయులకు కెనడా జారీచేసే సూపర్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయం గతంలో 210 రోజులు ఉండగా, ఇప్పుడు 208 రోజులకు తగ్గింది. ఇక స్టడీ పర్మిట్లు, శాశ్వత నివాస దరఖాస్తుల సమయాల్లో ఎలాంటి మార్పు లేదు.