ఇన్‌సర్వీస్ టీచర్లకు ఆర్నెల్ల బ్రిడ్జి కోర్సు
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:47 AM
బీఈడీ అర్హతతో ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆరు నెలల సర్టిఫికెట్ (బ్రిడ్జి) కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రారంభించారు. దీన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ద్వారా అమలు చేయనున్నారు.
ప్రారంభించిన కేంద్ర విద్యా మంత్రి జోషి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: బీఈడీ అర్హతతో ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆరు నెలల సర్టిఫికెట్ (బ్రిడ్జి) కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రారంభించారు. దీన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ద్వారా అమలు చేయనున్నారు. డీఎల్‌ఈడీ అర్హత లేని, 2018 జూన్ 28, 2023 ఆగస్టు 11 మధ్య ప్రాథమిక ఉపాధ్యాయులుగా నియమితులైన ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ఒక బ్రిడ్జి కోర్సును అమలు చేయాలని ఎన్‌సీటీఈకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కోర్సును రూపొందించారు. ఆన్‌లైన్ దూరవిద్యా విధానంలో అందించే ఈ కోర్సులో అకడమిక్ లెర్నింగ్‌తో పాటు 10 రోజుల ఆన్‌లైన్ కాంటాక్టు క్లాసులు, 20 రోజుల పాటు పాఠశాల ఆధారిత ప్రాక్టికల్, వీడియో ట్యూటోరియల్స్, ఈ-లెర్నింగ్ మెటీరియల్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి.