26, 27 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సదస్సు
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:03 AM
12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సదస్సుకు భారత పార్లమెంటు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ పార్లమెంటు పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో బ్రిక్స్ పార్లమెంటరీ..
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సదస్సుకు భారత పార్లమెంటు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ పార్లమెంటు పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశాలు జరగనున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రధాని మోదీ ఈ సమావేశాలకు హాజరై వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధి బృందాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతారని ఆయన వెల్లడించారు. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి పార్లమెంట్ స్పీకర్లు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. వ్యవస్థలను బలోపేతం చేయడంలో చట్టసభల పాత్ర, ఏఐ, డిజిటల్ సాంకేతికతల్లో మానవీయ విలువలతో కూడిన ఆవిష్కరణలు, ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సంస్కరణలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఓం బిర్లా తెలిపారు.