బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ భేష్!
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:41 AM
బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ బ్రిక్స్ సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో కూడిన ప్రకటన చేయడం హర్షణీయమని ఖుర్షీద్ అన్నారు.
స్వాగతించిన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ బ్రిక్స్ సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో కూడిన ప్రకటన చేయడం హర్షణీయమని ఖుర్షీద్ అన్నారు. విదాస్పద పరిస్థితులు, తీవ్రమైన సంక్షోభ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలన్నీ ఇలా ఏకతాటిపైకి రావడాన్ని అందరూ స్వాగతించాల్సిందేనని, తాను కూడా ఆ కోణంలోనే ఈ డిక్లరేషన్‌కు మద్దతు పలుకుతున్నానని ఖుర్షీద్ అన్నారు. ఇదిలా ఉండగా, బ్రిక్స్’ సదస్సు ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో పూర్తిగా శాకాహార వంటకాలనే ఏర్పాటుచేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భిన్నంగా స్పందించారు. దేశంలో 80ు మంది ప్రజలు నాన్‌వెజ్ తింటారని వ్యాఖ్యానించారు. ఈ విందు భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించడం లేదన్న కోణంలో ఆయన ఈ విమర్శ చేశారు. అయితే, ఆహార మెనూపై కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్రమంత్రి రిజిజు అన్నారు.