తాడు కట్టకుండానే విసిరేశారు
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:28 AM
సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బ్రెజిల్‌లో బంగీ జంప్ చేస్తూ ఓ మహిళ మృతి చెందింది. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ ...
సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బ్రెజిల్‌లో బంగీ జంప్ చేస్తూ ఓ మహిళ మృతి చెందింది. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మరియా(21) శనివారం 131 అడుగుల ఎత్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. లిమెయిరాలోని స్కెలిటన్ బ్రిడ్జి పైనుంచి బంగీ జంప్ చేయడానికి ఆమె ప్రయత్నించింది. అయితే ఆమెకు రక్షణ తాడు కట్టాల్సి ఉండగా, దాన్ని మరిచిపోయిన సిబ్బంది ఆమెను వంతెన చివరికి తీసుకెళ్లి అక్కడి నుంచి బంగీజం్‌పలో భాగంగా కిందికి తోశారు. దాంతో ఆమె కిందపడి ప్రాణాలు కోల్పోయారు.