తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:47 AM
కేవలం తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి పేరు, కులం కూడా రాయాల్సిన పనిలేదని తెలిపింది.
ముంబయి, ఫిబ్రవరి 19: కేవలం తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరం లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి పేరు, కులం కూడా రాయాల్సిన పనిలేదని తెలిపింది. ఆ మేరకు పాఠశాల దస్త్రాల్లో ఇంటిపేరు, కులం పేర్లను మార్చి రాయాలని ఆదేశించింది. రికార్డుల్లో తండ్రి ఇంటి పేరును, కులం పేరును తొలగించి తల్లి ఇంటి పేరు, కులం పేరును నమోదు చేయాలంటూ 12 ఏళ్ల బాలిక చేసిన వినతికి స్పందించిన జస్టిస్ విభా కన్‌కన్‌వాడి, జస్టిస్ హితేన్ వెనెగావ్కర్‌ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తల్లే ‘సింగిల్ పేరెంట్’గా వ్యవహరిస్తూ ఆ బాలికను పోషిస్తుంటే ఆమె ఇంటిపేరు, కులమే బిడ్డకు కూడా వర్తిస్తాయని తెలిపింది.