నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:22 AM
ప్రముఖ నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నై తేనాంపేటలోని ఆమె నివాసంలో బాంబు పెట్టినట్టు సోమవారం...
చెన్నై, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నై తేనాంపేటలోని ఆమె నివాసంలో బాంబు పెట్టినట్టు సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో డీజీపీ కార్యాలయ కంట్రోల్ రూమ్‌కు ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో వెళ్లి త్రిష ఇల్లంతా జల్లెడ పట్టారు. తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.