Share News

వేదాంత ఛత్తీస్‌గఢ్‌ పవర్‌ ప్లాంట్‌లో పేలిన బాయిలర్‌

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:58 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. శక్తి జిల్లా సింఘితరాయ్‌లో ఉన్న వేదాంత లిమిటెడ్‌ పవర్‌ ప్లాంట్‌లో మంగళవారం బాయిలర్‌ పేలుడు కారణంగా 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు.

వేదాంత ఛత్తీస్‌గఢ్‌ పవర్‌ ప్లాంట్‌లో పేలిన బాయిలర్‌

  • 13మంది కార్మికుల మృతి, మరో 21 మందికి గాయాలు

శక్తి (ఛత్తీస్‌గఢ్‌), ఏప్రిల్‌ 14: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. శక్తి జిల్లా సింఘితరాయ్‌లో ఉన్న వేదాంత లిమిటెడ్‌ పవర్‌ ప్లాంట్‌లో మంగళవారం బాయిలర్‌ పేలుడు కారణంగా 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 21 మందికి గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పవర్‌ ప్లాంట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌లో మంగళవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడుకు సంబంధించిన సమాచారం అందగానే స్థానిక పరిపాలనా అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయ్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు రాయ్‌పూర్‌లో పాత్రికేయులతో సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Updated Date - Apr 15 , 2026 | 03:58 AM