బ్లింకిట్ అంబులెన్స్‌కు రూ.2,500 చార్జీ
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:11 AM
బ్లింకిట్ అంబులెన్స్ సేవలను సాధారణ అవసరాలకు వినియోగించుకునే వారు ఇకపై ప్రతి బుకింగ్‌కు రూ.2,500 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
అత్యవసర తరలింపు సేవలకు మాత్రం ఉచితం
న్యూఢిల్లీ, నవంబరు 5: బ్లింకిట్ అంబులెన్స్ సేవలను సాధారణ అవసరాలకు వినియోగించుకునే వారు ఇకపై ప్రతి బుకింగ్‌కు రూ.2,500 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే, అత్యవసర పరిస్థితుల్లో అయితే ఇకపైనా ఉచితంగానే వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని బ్లింకిట్ మాతృసంస్థ ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించారు. ‘‘గత రెండేళ్లలో 20వేలకు పైగా అత్యవసర కేసులకు రూపాయి కూడా తీసుకోకుండానే అంబులెన్స్ సేవలను అందించాం. ఇకపైనా ఉచితంగానే అందించాలనుకుంటున్నాం. కానీ అన్నీ ఉచితం కావడంతో సాధారణ హెల్త్ చెక్‌పలు, ఆస్పత్రి సందర్శనలు, ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్లేందుకూ బ్లింకింట్ అంబులెన్స్‌లను బుక్ చేసుకుంటున్నారు. ఈ తరహా సేవలను ఉబర్ లేదా ఇతర ప్రైవేటు రవాణా వాహనాలు అందించగలవు. ఇలాంటి బుకింగ్‌లతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి అత్యవసర వైద్య పరికరాలు, పారా మెడికల్ సిబ్బందితో కూడిన అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోతుంది’’ అని తమ నిర్ణయానికి గల కారణాన్ని గోయల్ వివరించారు.