Share News

కాంగ్రెస్‌ ఎంపీ అకోయిజమ్‌ను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చెయ్యండి

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:48 AM

ఢిల్లీలోని జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌, కాంగ్రెస్‌ ఎంపీ బిమోల్‌ అకోయిజంపై నమోదైన లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీజేపీ మహిళా ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ ఎంపీ అకోయిజమ్‌ను   లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చెయ్యండి
BJP MP

  • రాష్ట్రపతిని కోరిన బీజేపీ మహిళా ఎంపీలు

న్యూఢిల్లీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌, కాంగ్రెస్‌ ఎంపీ బిమోల్‌ అకోయిజంపై నమోదైన లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీజేపీ మహిళా ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అకోయిజం లైంగిక వేధింపుల అంశాన్ని లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లి, ఆయన ప్రవర్తనపై సమగ్ర విచారణ నిమిత్తం ఎథిక్స్‌ కమిటీకి నివేదించాలని కోరారు. పార్లమెంటు గౌరవాన్ని, నైతిక విలువలను కాపాడేందుకు విచారణ పూర్తయ్యే వరకు ఎంపీ అకోయిజంను పార్లమెంటరీ కార్యకలాపాల నుంచి తక్షణమే సస్పెండ్‌ చేయాలని రాష్ట్రపతిని కోరారు. మంగళవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో 15 మంది మహిళా ఎంపీల బృందం రాష్ట్రపతికి ఈ మేరకు వినతిపత్రం అందజేసింది.

Updated Date - Oct 14 , 2026 | 06:48 AM