ఉప ఎన్నికల్లో ఏడింటిలో 4 స్థానాలు బీజేపీవే
ABN , Publish Date - May 05 , 2026 | 05:01 AM
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మహారాష్ట్రలోని రాహురీ, బారామతి; కర్ణాటకలో..
న్యూఢిల్లీ, మే 4: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మహారాష్ట్రలోని రాహురీ, బారామతి; కర్ణాటకలో బాగట్‌కోట్, దావనగెరె సౌత్; గుజరాత్‌లో ఉమ్రత్, నాగాలాండ్ కొరిడాండ్; త్రిపురలో ధర్మనగర్‌లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఏడింటిలో నాలుగు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయగా.. మరో రెండింట్లో కాంగ్రెస్ గెలుపొందింది. మహారాష్ట్రలోని బారామతిలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఘనవిజయం సాధించారు. మరో నియోజకవర్గం రాహురీలో బీజేపీ అభ్యర్థి 1.12లక్షల పైచిలుకు మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుపొందారు.