Vijay Party: తమిళనాడులో విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు?
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:03 AM
తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే(తమిళగ వెట్రి కళగం) పార్టీతో పొత్తు పెట్టుకునే అంశాన్ని బీజేపీ చాలా సీరియ్‌సగా పరిశీలిస్తోందని ....
న్యూఢిల్లీ, జనవరి 5: తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే(తమిళగ వెట్రి కళగం) పార్టీతో పొత్తు పెట్టుకునే అంశాన్ని బీజేపీ చాలా సీరియ్‌సగా పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీఎంకే వ్యతిరేకులందరినీ ఒక్క తాటిపైకి తేవాలని సందేశం ఇచ్చేందుకే ఉద్దేశపూర్వకంగా అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని కలవలేదని ఆ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను బీజేపీ తీక్షణంగా పరిశీలిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఎన్టీయే కేవలం ఒక పార్టీకి, లేదా ఒక నేతకు పరిమితం కాకూడదని, ఏఎంఎంకే, పీఎంకే, అలాగే, అన్నాడీఎంకేలోని అసంతృప్త నేతల వరకు డీఎంకే వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని నొక్కి చెప్పడమే పళనిస్వామిని కలవకపోవడంలో ఉద్దేశం’ అని బీజేపీ నేత ఒకరు చెప్పారు.