Share News

ఫాల్తాలో లక్షకుపైగా మెజారిటీతో బీజేపీ విజయం

ABN , Publish Date - May 25 , 2026 | 04:00 AM

పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్‌లో బీజేపీ లక్షకుపైగా మెజారిటీతో ఘన విషయం సాధించింది...

ఫాల్తాలో లక్షకుపైగా మెజారిటీతో బీజేపీ విజయం

కోల్‌కతా, మే 24: పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్‌లో బీజేపీ లక్షకుపైగా మెజారిటీతో ఘన విషయం సాధించింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అభ్యర్థి దేబాంగ్షు పండా 1.09 లక్షల మెజారిటీ సాధించారు. ఏప్రిల్‌ 29న జరిగిన ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఎలక్షన్‌ కమిషన్‌ ఆ రోజున పోలింగ్‌ను నిలిపివేసి ఈ నెల 21న రీపోలింగ్‌ నిర్వహించింది. బీజేపీ అభ్యర్థి పండాకు 1,49,666 ఓట్లు రాగా, ద్వితీయ స్థానంలో ఉన్న సీపీఎం అభ్యర్థి శంబునాథ్‌ కుర్మీకి 40,645 ఓట్లు వచ్చాయి. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు చివరిక్షణంలో ప్రకటించిన తృణమూల్‌ అభ్యర్థి జహంగీర్‌ ఖాన్‌కు 7,783 ఓట్లు వచ్చాయి.

Updated Date - May 25 , 2026 | 04:00 AM