రైల్వే స్థలాల ఆక్రమణలను అరికట్టండి
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:46 AM
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ కారిడార్లలో రైల్వే భూములు ఆక్రమణలకు గురవుతుండడంపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో ఎంపీ కె.లక్ష్మణ్
న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ కారిడార్లలో రైల్వే భూములు ఆక్రమణలకు గురవుతుండడంపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కారిడార్లలో రైల్వే పట్టాల పక్కన అక్రమంగా ఇళ్ల నిర్మాణం, వ్యవసాయ పనులు చేపట్టడమే కాకుండా ఈ మధ్యకాలంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైయ్యాయని తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, రైల్వే స్థలాల ఆక్రమణ వల్ల రైళ్ల నిర్వహణకు ఎదురవుతున్న ముప్పు గురించి సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైలు పట్టాల పక్కన అక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రైల్వే భూముల ఆక్రమణలను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు.