ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. అరాచకాన్ని తరిమేద్దాం’
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:10 AM
ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బీజేపీ శ్రీకారం చుట్టింది.
ఓటర్లలో చైతన్యానికి బీజేపీ ప్రచార భేరీ!
న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. అరాచకాన్ని తరిమేద్దాం’ పేరుతో దేశవ్యాప్తంగా రెండు విడతల్లో ఈ భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వెల్లడించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్గదర్శకత్వంలో శుక్రవారం ప్రారంభమైన మొదటి విడత ప్రచారంనవంబరు 5వరకు కొనసాగనుంది. రెండో విడత కార్యక్రమాలు నవంబరు 11నుంచి 30వరకు నిర్వహించనున్నారు. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ ప్రజా చైతన్య ఉద్యమాన్ని చేపట్టినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 10వేల మందితో పాదయాత్రలు చేపట్టనున్నారు.