Share News

సర్‌పై ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడి కీలక భేటీలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:28 AM

ఓట్‌ చోరీపై ఇండియా కూటమి నవంబరు 1న నిర్వహించనున్న ర్యాలీని ఎదుర్కొనేందుకు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహారచనపై..

సర్‌పై ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడి కీలక భేటీలు

  • వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపైనా వ్యూహరచన

  • పాల్గొన్న కేంద్ర మంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు

న్యూఢిల్లీ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఓట్‌ చోరీపై ఇండియా కూటమి నవంబరు 1న నిర్వహించనున్న ర్యాలీని ఎదుర్కొనేందుకు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహారచనపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్‌ నబీన్‌ రెండు కీలక సమావేశాలను నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో, కేంద్ర మంత్రులతో ఆయన వేర్వేరుగా భేటీ ఆయ్యారు. ‘సర్‌’పై ప్రతిపక్షాల దుష్పప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో రూపొందించామని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌, జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్‌ తావ్డే, స్మృతి ఇరానీ, సునీల్‌ బన్సల్‌, బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ పాల్గొన్నారు. అనంతరం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి-అరాచకత్వాన్ని నిర్మూలించాలి’ కార్యక్రమ ప్రచారాన్ని సమీక్షించేందుకు కేంద్ర మంత్రులతో నితీన్‌ నబీన్‌ మరో సమావేశాన్ని నిర్వహించారు. సర్‌పై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రచారాన్ని మరింత ఉదృతం చేయడం, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీజేపీ వైఖరిని ప్రజలకు తెలియజేయడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించారు. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, శివరాజ్‌సింగ్‌, కిరణ్‌ రిజిజు, అశ్వినీవైష్ణవ్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 02:30 AM