Share News

టాప్‌ 1000 ర్యాంకర్లకు బిట్స్‌ పిలానీ స్కాలర్‌షిప్‌లు

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:50 AM

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పిలానీ 2027 నుంచి నిర్వహించే ఎంట్రన్స్‌(బిట్‌శాట్‌)లో టాప్‌ వెయ్యి ర్యాంకర్లకు స్కాలర్‌షిప్పులు ఇస్తామని ప్రకటించింది.

టాప్‌ 1000 ర్యాంకర్లకు బిట్స్‌ పిలానీ స్కాలర్‌షిప్‌లు

న్యూఢిల్లీ, నవంబరు 1: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పిలానీ 2027 నుంచి నిర్వహించే ఎంట్రన్స్‌(బిట్‌శాట్‌)లో టాప్‌ వెయ్యి ర్యాంకర్లకు స్కాలర్‌షిప్పులు ఇస్తామని ప్రకటించింది. వెయ్యిలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ట్యూషన్‌ ఫీజును పూర్తిగా చెల్లించనుంది. అయితే ఆ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20లక్షల్లోపు ఉండాలని షరతు పెట్టింది. అదే సమయంలో ప్రతి సెమిస్టర్‌లో కనీం 7.5 శాతం సీజీపీఏ కొనసాగించాలి. బిట్స్‌ పిలానీకి రాజస్థాన్‌, హైదరాబాద్‌, గోవాలో క్యాంప్‌సలున్నాయి.

Updated Date - Nov 02 , 2026 | 02:52 AM