Share News

‘బిస్లెరీ’ నీళ్లలో పరిమితి కన్నా ఎక్కువ బ్రొమేట్‌

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:34 AM

సరైన నాణ్యతా నిబంధనలు పాటించని ఆహార, పానీయాల కంపెనీలపై ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కొరడా ఝుళిపించింది. తాజాగా బిస్లెరీ ఇంటర్నేషనల్‌ సంస్థపై ప్రాసిక్యూషన్‌కు ఆమోదం తెలిపింది.

‘బిస్లెరీ’ నీళ్లలో పరిమితి కన్నా ఎక్కువ బ్రొమేట్‌

  • ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, నవంబరు 22: సరైన నాణ్యతా నిబంధనలు పాటించని ఆహార, పానీయాల కంపెనీలపై ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కొరడా ఝుళిపించింది. తాజాగా బిస్లెరీ ఇంటర్నేషనల్‌ సంస్థపై ప్రాసిక్యూషన్‌కు ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ప్రాంగణం నుంచి శాంపిల్‌గా సేకరించిన వాటర్‌ బాటిళ్లలోని నీళ్లు తాగడానికి ఏ మాత్రం సురక్షితం కాదని పరీక్షల్లో తేలడంతో ఈ చర్య తీసుకుంది. ఈ బాటిళ్లలోని నీటిలో బ్రొమేట్‌ అనే రసాయనం నిర్ణీత స్థాయి కంటే ఎక్కువగా ఉండడంతో ఈ చర్య తీసుకుంది. కంపెనీ అప్పీల్‌తో మరో ల్యాబ్‌లో పరీక్షించినా ఇదే విషయం తేలినట్టు తెలిపింది. బిస్లెరీతో పాటు వసంత్‌ మసాలా ప్రైవేట్‌ లిమిటెడ్‌, టిట్‌ బిట్‌ ఫుడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మీమాంస ఇండస్ట్రీస్‌, ఆశా కన్‌ఫెక్షనరీ కంపెనీలపై ప్రాసిక్యూషన్‌కూ ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ఆమోదం తెలిపింది.

Updated Date - Nov 23 , 2026 | 03:35 AM