ఇక నాసిరకం స్క్రీ న్ గార్డ్ లకు చెక్!
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:21 AM
ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడం సర్వసాధారణమైపోయింది. అయితే, అది పొరపాటు జారిపడితే ఎక్కడ తెర (స్ర్కీన్) పగిలిపోతుందోన్న భయం ఉంటుంది. అందుకే ఖరీదైన ఫోన్‌కు రక్షణగా టెంపర్డ్ గ్లాసులు, స్ర్కీన్ గార్డులు వాడుతుంటారు.
ఏప్రిల్ నుంచి ‘బీఐఎస్’ మార్క్ తప్పనిసరి
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడం సర్వసాధారణమైపోయింది. అయితే, అది పొరపాటు జారిపడితే ఎక్కడ తెర (స్ర్కీన్) పగిలిపోతుందోన్న భయం ఉంటుంది. అందుకే ఖరీదైన ఫోన్‌కు రక్షణగా టెంపర్డ్ గ్లాసులు, స్ర్కీన్ గార్డులు వాడుతుంటారు. మార్కెట్లో ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్న నాసిరకం స్ర్కీన్ ప్రొటెక్టర్లతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అదే సమయంలో నిరుద్యోగులకు, దేశీయ తయారీ రంగానికి ఇది వరంలా మారనుంది. స్మార్ట్‌ఫోన్ల స్ర్కీన్ ప్రొటెక్టర్లకు ఇకపై ‘భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్)’ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించేలా 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన కచ్చితంగా అమల్లోకి రానుంది. బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా మారేందుకు తయారీదారులకు 2027 మార్చి 31 వరకు ప్రభుత్వం గడువిచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు వినియోగదారులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలకా్ట్రనిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) హర్షం వ్యక్తం చేసింది. స్వదేశీ తయారీ, ఎగుమతులకు ఊతం ఇవ్వడం ద్వారా ఈ రంగం ఏకంగా రూ.12-16 వేల కోట్ల పరిశ్రమగా ఎదగనుందని అంచనా వేసింది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 60 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అటు ప్రభుత్వ ఖజానాకు సైతం రూ.2,000 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరనుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తిని పెంచుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా ఇదో గొప్ప ముందడుగని ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశోక్ గుప్తా పేర్కొన్నారు. డిమాండ్‌ను తట్టుకునేలా తమ సంస్థ అదనంగా 2 కోట్ల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు.