బిహార్ ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తుల మృతి
ABN , Publish Date - Apr 01 , 2026 | 03:48 AM
బిహార్‌లో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. నలందా జిల్లా దీప్ నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని శీతల మాతా ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు.
మరో 8 మందికి గాయాలు
బిహార్ షరీఫ్ (బిహార్), మార్చి 31: బిహార్‌లో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. నలందా జిల్లా దీప్ నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని శీతల మాతా ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈక్రమంలో ఒక్కసారిగా భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఫలితంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు బిహార్ షరీఫ్ అసిస్టెంట్ ఎస్పీ నూరుల్ హక్ తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించారు. ఈ విషాద ఘటనలో భక్తుల మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు. ఈ ఘటన అత్యంత హృదయ విదారక మన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆలయంలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ దుర్ఘటన పట్ల బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.6 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.