బిహార్ మార్కుల పట్టికల్లో ఇక ‘ఫెయిల్’ ఉండదు
ABN , Publish Date - Aug 30 , 2026 | 06:22 AM
పదవ, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కుల పట్టికల్లో ఇక ‘ఫెయిల్ (అనుత్తీర్ణులు)’ అన్న పదం స్థానంలో ‘నైపుణ్యాభివృద్ధికి అర్హులు’ అనే పదాన్ని ముద్రించాలని..
పట్నా, ఆగస్టు 29: పదవ, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కుల పట్టికల్లో ఇక ‘ఫెయిల్ (అనుత్తీర్ణులు)’ అన్న పదం స్థానంలో ‘నైపుణ్యాభివృద్ధికి అర్హులు’ అనే పదాన్ని ముద్రించాలని బీహార్ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత (2026-27) విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నదని ఆ శాఖ అధికారులు శనివారం తెలిపారు. బీహార్ బోర్డు ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్స్ (బీబీఓఎస్ఈ) నిర్వహించే వృత్తి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి విద్యార్థులకు అనుమతినివ్వడమే దీని లక్ష్యమన్నారు. పరీక్షల్లో ఆశించిన (నిర్దేశిత) మార్కులు రానంత మాత్రాన విద్యార్థుల్లో ప్రతిభ అదృశ్యం కాదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మిథ్లేశ్ తివారీ మీడియాకు చెప్పారు.