వరద సాయం.. తీసింది ప్రాణం!
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:24 AM
వరద సాయం ప్యాకెట్ ఊహించని రీతిలో ఒకరి ప్రాణం తీసింది.. హెలికాప్టర్ నుంచి జారవిడిచిన సహాయక సామగ్రి, ఆహార పదార్థాలతో కూడిన ప్యాకెట్ దురదృష్టవశాత్తు తల మీద పడటంతో..
హెలికాప్టర్ నుంచి జారవిడిచిన ఆహార పొట్లం తలపై పడి వ్యక్తి మృతి
బిహార్‌లోని సారణ్‌లో విషాదం
సారణ్, అక్టోబరు 4: వరద సాయం ప్యాకెట్ ఊహించని రీతిలో ఒకరి ప్రాణం తీసింది.. హెలికాప్టర్ నుంచి జారవిడిచిన సహాయక సామగ్రి, ఆహార పదార్థాలతో కూడిన ప్యాకెట్ దురదృష్టవశాత్తు తల మీద పడటంతో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మరణించాడు. బిహార్‌లోని సారణ్ జిల్లా పరశురాంపూర్ గ్రామంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరదల నేపథ్యంలో ఆ గ్రామంలోని క్యాంపు సమీపంలో హెలికాప్టర్ నుంచి ఆహార ప్యాకెట్లను జార విడిచారు. ఇదే క్రమంలో ఓ ప్యాకెట్ స్థానికుడు అనిల్ కుమార్ సింగ్ (57) తలపై పడటంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో.. తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్ కారణంగా గాలికి రేకుల షెడ్డు కూలి ఓ మహిళ గాయపడింది.