భోజ్‌శాల తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు
ABN , Publish Date - May 23 , 2026 | 03:59 AM
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న వివాదాస్పద కట్టడం భోజ్‌శాల... సరస్వతీదేవి మందిరం అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలయింది.
న్యూఢిల్లీ, మే 22: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న వివాదాస్పద కట్టడం భోజ్‌శాల... సరస్వతీదేవి మందిరం అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలయింది. మసీదు సంరక్షకుడు క్వాజీ మొయినుద్దీన్ దీన్ని దాఖలు చేశారు. 11వ శాతాబ్దానికి చెందిన ఈ కట్టడం కమల్ మౌలా మసీదు అని ముస్లిం పక్షం వాదిస్తోంది. వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రతి మంగళవారం హిందువులు, ప్రతి శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని ఈ కట్టడం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న భారత పురావస్తు విభాగం 2003లో ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 23 ఏళ్ల అనంతరం భోజశాలలో నమాజ్‌లు నిలిచిపోనున్నాయి.