Share News

రేప్‌ కేసుల సెటిల్‌మెంట్‌కు రూ.5 కోట్లు!

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:19 AM

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఆయన సతీమణి గుర్‌ప్రీత్‌ కౌర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. సీఎం దంపతులు రేప్‌ కేసుల్ని సెటిల్‌ చేసేందుకు మధ్యవర్తుల ద్వారా ఒక రాకెట్‌ నడుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది

రేప్‌ కేసుల సెటిల్‌మెంట్‌కు రూ.5 కోట్లు!

  • పంజాబ్‌ సీఎం మాన్‌ దంపతులపై బీజేపీ తీవ్ర ఆరోపణలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఆయన సతీమణి గుర్‌ప్రీత్‌ కౌర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. సీఎం దంపతులు రేప్‌ కేసుల్ని సెటిల్‌ చేసేందుకు మధ్యవర్తుల ద్వారా ఒక రాకెట్‌ నడుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అందుకోసం రూ.5 కోట్లు తీసుకున్నారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. అందుకు ఆధారాలు అంటూ కొన్ని ఆడియో క్లిప్‌లను విడుదల చేశారు. కొన్నిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ గుర్విందర్‌సింగ్‌ చాహల్‌ జైలు నుంచి విడుదలవడంతో ఈ వివాదం మొదలైంది. ఒక మహిళను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నా యి. చాహల్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు గుర్‌ప్రీత్‌ కౌర్‌ రూ.5కోట్లు డిమాండ్‌ చేశారని మాజీ న్యాయమూర్తి రంజిత్‌సింగ్‌ ఆరోపణలు చేశారు. ఈక్రమంలోనే బీజేపీ నేత ప్రదీప్‌ ఆడియో క్లిప్స్‌ విడుదల చేశారు. కాగా, బీజేపీ ఆరోపణలను ఆప్‌ ఖండించింది. పార్టీ నేతలను అప్రతిష్ఠపాలు చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించింది.

Updated Date - Sep 04 , 2026 | 06:30 AM