Share News

ఆ నాలుగు రాష్ట్రాల వారికి ఉద్యోగాలివ్వం

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:00 AM

ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాల వారికి తమ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వబోం అంటూ బెంగళూరు నగరానికి చెందిన ‘ఏ-1 స్పోర్ట్స్‌ వరల్డ్‌ ఫౌండర్‌’ సీఈవో కార్తిక్‌ శెణై ‘ఎక్స్‌’లో..

ఆ నాలుగు రాష్ట్రాల వారికి ఉద్యోగాలివ్వం

  • ఏ-1 స్పోర్ట్స్‌ వరల్డ్‌ ఫౌండర్‌ సీఈవో కార్తిక్‌ శెణై

బెంగళూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాల వారికి తమ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వబోం అంటూ బెంగళూరు నగరానికి చెందిన ‘ఏ-1 స్పోర్ట్స్‌ వరల్డ్‌ ఫౌండర్‌’ సీఈవో కార్తిక్‌ శెణై ‘ఎక్స్‌’లో చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల వారిని తమ కంపెనీలో నియమించుకునేది లేదని ఆయన గురువారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆ రాష్ట్రాల పు రుష ఉద్యోగులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారని అందు లో పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ పోస్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇది కంపెనీ నిర్ణయమని ఆయన వివరణ ఇచ్చారు.

Updated Date - Sep 25 , 2026 | 06:02 AM