నీ పిల్లివల్లే... మా పిల్లికి పిల్లలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:51 AM
బెంగళూరులోని శేషాద్రిపురం జయభీమనగర్‌లో ఇరుగుపొరుగు వ్యక్తులు ఒకరు ఆడ పిల్లిని... మరొకరు మగ పిల్లిని పెంచుకుంటున్నారు. ఆదివారం ఆడపిల్లి నాలుగు పిల్లలను ఈనింది.
పోలీసులు పరిష్కరించిన రెండు కుటుంబాల ‘పిల్లి పోరు’
బెంగళూరు, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని శేషాద్రిపురం జయభీమనగర్‌లో ఇరుగుపొరుగు వ్యక్తులు ఒకరు ఆడ పిల్లిని... మరొకరు మగ పిల్లిని పెంచుకుంటున్నారు. ఆదివారం ఆడపిల్లి నాలుగు పిల్లలను ఈనింది. పిల్లి పిల్లల గొడవ తట్టుకోలేకో ఏమో... ఆ ఇంటి యజమాని కోపంతో పక్కింలోని మగపిల్లి యజమానితో గొడవపడ్డాడు. ‘మా ఇంటిలోని ఆడపిల్లి నాలుగు పిల్లలను కన్నది. దానికి మీ మగ పిల్లే కారణం. కాబట్టి ఆ పిల్లలను సాకే బాధ్యత నీదే’ అంటూ ఆ పిల్లి పిల్లలను తీసుకొచ్చి వారి ఇంట్లో వదిలేశాడు. దీంతో ఇరు కుటుంబాలు రగడకు దిగాయి. అది తీవ్రమవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆ నాలుగు పిల్లి పిల్లలను రెండేసి చొప్పున వారిద్దరికీ ఇచ్చి పెంచాలని సూచించి ‘పిల్లి పోరు’ను తీర్చారు.