Share News

వెనకాల కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదంటూ గిటార్‌కు 500ఫైన్‌ వేసిన ఏఐ

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:44 AM

బెంగళూరులో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ప్రతి కూడళ్లలోనూ అమర్చారు.

వెనకాల కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదంటూ గిటార్‌కు 500ఫైన్‌ వేసిన ఏఐ

బెంగళూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ప్రతి కూడళ్లలోనూ అమర్చారు. ఈ నెల 15న సోవిక్‌ దత్తా అనే వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తూ భుజానికి గిటార్‌ తగిలించుకున్నారు. హెబ్బాళ నుంచి టిన్‌ ఫ్యాక్టరీ వైపు ప్రయాణించారు. ఓ సర్కిల్‌లో ఏఐ కెమెరా ఆయన తగిలించుకున్న గిటార్‌ను వెనుకవైపు కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌)గా భావించి.. అతను హెల్మెట్‌ ధరించలేదనే కారణంతో రూ.500 చలానా విధించింది. ఈ సందేశం సోవిక్‌ దత్తా భార్య మొబైల్‌కు వచ్చింది. వాటి వివరాలను బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసు వెబ్‌సైట్‌లో పరిశీలించినపుడు ఫొటో లభించింది. ఏఐ కెమెరా తప్పిదం వల్లే ఇదంతా జరిగినట్టు గుర్తించారు.

Updated Date - Sep 28 , 2026 | 05:45 AM