Share News

బీసీఐ సభ్యుడిగా కిరణ్‌ కుమార్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:23 AM

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) సభ్యుడిగా తెలంగాణ నుంచి ఎన్నికైన జి.కిరణ్‌ కుమార్‌ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం న్యూఢిల్లీలోని బీసీఐ కార్యాలయంలో కౌన్సిల్‌ చైర్మన్‌ మన్నన్‌ కుమార్‌ మిశ్రా సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు.

బీసీఐ సభ్యుడిగా కిరణ్‌ కుమార్‌
kirankumar

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) సభ్యుడిగా తెలంగాణ నుంచి ఎన్నికైన జి.కిరణ్‌ కుమార్‌ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం న్యూఢిల్లీలోని బీసీఐ కార్యాలయంలో కౌన్సిల్‌ చైర్మన్‌ మన్నన్‌ కుమార్‌ మిశ్రా సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలోని బార్‌ కౌన్సిళ్ల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కిరణ్‌ కుమార్‌ తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్‌ స్వస్థలం సిద్దిపేట కాగా, 25 ఏళ్లుగా నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టుల బార్‌ అసోసియేషన్‌కు అధ్యక్ష, కార్యదర్శి హోదాల్లో న్యాయవాదుల సంక్షేమం కోసం పని చేశారు.

Updated Date - Sep 21 , 2026 | 05:23 AM