Share News

ఉద్యోగుల సమ్మె.. నిలిచిన బ్యాంకు సేవలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:57 AM

యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎ్‌ఫబీసీ) ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు సమ్మె పాటించడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో శుక్రవారం సేవలు నిలిచిపోయాయి.

ఉద్యోగుల సమ్మె.. నిలిచిన బ్యాంకు సేవలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎ్‌ఫబీసీ) ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు సమ్మె పాటించడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో శుక్రవారం సేవలు నిలిచిపోయాయి. ఐదు రోజుల పని దినాల విధానం అమలు సహా పలు డిమాండ్ల సాధనకు బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు కొన్ని పాత ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా బంద్‌ పాటించాయి. దీంతో ఆయా బ్యాంకుల శాఖలు శుక్రవారం పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి. బ్యాంకుల శాఖల్లో నగదు డిపాజిట్‌, విత్‌ డ్రా, చెక్కుల క్లియరెన్సులతోపాటు ఇతర పనులు నిలిచిపోయాయి. కానీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలు ఎప్పట్లానే కొనసాగాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. దీంతో ఆ బ్యాంకులు యఽథాతథంగా పని చేశాయి. కాగా, శని, ఆదివారాలతోపాటు వినాయక చవితి సందర్భంగా సోమవారం కూడా బ్యాంకులకు వరుసగా సెలవు దినాలు కావడం గమనార్హం. కాగా, ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలను తమ డిమాండ్లను పట్టించుకోకపోతే అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

Updated Date - Sep 12 , 2026 | 05:58 AM