Share News

ఉపరాష్ట్రపతితో బండారు దత్తాత్రేయ భేటీ

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:38 AM

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో హరియాణా మాజీ గవర్నర్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు.

ఉపరాష్ట్రపతితో బండారు దత్తాత్రేయ భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో హరియాణా మాజీ గవర్నర్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. మంగళవారం, ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయనను దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో భాగంగా ఇరువురు నేతలు దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, వివిధ ప్రజా సమస్యలు, అభివృద్థి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ ఉప రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Feb 18 , 2026 | 06:38 AM