Share News

బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లోకి ఇకపై హిందువులకే అనుమతి

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:03 AM

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లోకి ఇకపై హిందూయేతరులను అనుమతించరు. అంతేకాదు ఈ 2పుణ్యక్షేత్రాల కమిటీ పరిధిలోకి వచ్చే మరో 46 ఆలయాల్లోకి కూడా హిందూయేతరులను అనుమతించరాదని బద్రీనాథ్‌....

బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లోకి ఇకపై హిందువులకే అనుమతి

డెహ్రాడూన్‌, జనవరి 26: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లోకి ఇకపై హిందూయేతరులను అనుమతించరు. అంతేకాదు ఈ 2పుణ్యక్షేత్రాల కమిటీ పరిధిలోకి వచ్చే మరో 46 ఆలయాల్లోకి కూడా హిందూయేతరులను అనుమతించరాదని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలో ప్రతిపాదనను ఆమోదిస్తామని కమిటీ చైర్మన్‌ హేమంత్‌ ద్వివేదీ తెలిపారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గంగోత్రిలో ఇప్పటికే హిందూయేతరులను అనుమతించరాదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ మద్దతు పలకగా కాంగ్రెస్‌ తప్పుబట్టింది.

Updated Date - Jan 27 , 2026 | 03:03 AM