Share News

రామ మందిర నిధుల చోరీపై ఎఫ్‌ఐఆర్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:55 AM

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు గురువారం పోలీసు వర్గాలు తెలిపాయి.

రామ మందిర నిధుల చోరీపై ఎఫ్‌ఐఆర్‌

  • 8 మందిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

అయోధ్య, జూన్‌ 25: అయోధ్యలోని శ్రీరామ మందిరంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు గురువారం పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఇప్పటికే విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని కేసు పెట్టినట్టు పేర్కొన్నాయి. ఎనిమిది మందిని కస్టడీలోకి తీసుకున్నామని, వారిలో ఆరుగురు ఆలయ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించాయి. వీరి దొంగతనం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రూ.7 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల మధ్య దుర్వినియోగం జరిగినట్టు భావిస్తున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 03:55 AM