Share News

పవన్‌ ఖేరా బెయిల్‌పై సుప్రీంకు అసోం పోలీసులు

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:21 AM

ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ అసోం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పవన్‌ ఖేరా బెయిల్‌పై సుప్రీంకు అసోం పోలీసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ అసోం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భుయాన్‌ శర్మకు వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులు ఉన్నాయని పవన్‌ ఖేరా ఆరోపించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ రిణికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈనెల 10న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. సుజన.. పవన్‌ ఖేరాకు వారంరోజుల పాటు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ లోపు తగిన ఉపశమనం కోసం గువాహటి హైకోర్టును ఆశ్రయించాలని ఆదేశించారు. హైకోర్టు తీర్పును అసోం పోలీసులు ఈ నెల 12న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఇది బుధవారం జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.

Updated Date - Apr 14 , 2026 | 04:21 AM