Share News

అస్సాంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:28 AM

అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎంపీ ప్రద్యుత్‌ బొర్డోలోయ్‌ బీజేపీలో చేరారు. గువాహటిలో అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ సమక్షంలో...

అస్సాంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

  • బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రద్యుత్‌ బొర్డోలోయ్‌

న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎంపీ ప్రద్యుత్‌ బొర్డోలోయ్‌ బీజేపీలో చేరారు. గువాహటిలో అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ సమక్షంలో రాష్ట్ర బీజేపీ చీఫ్‌ దిలీప్‌ సైకియా ఆయనకు స్వాగతం పలికారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ప్రద్యుత్‌ తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు పంపారు. ఆయన పార్టీని వీడటం దురదృష్టకరమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. టికెట్ల కేటాయింపులో విభేదాలు ఏర్పడి ఆయన పార్టీకి రాజీనామా చేసి ఉంటారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు ప్రియాంకా వాద్రా అభిప్రాయపడ్డారు.

Updated Date - Mar 19 , 2026 | 06:28 AM