Share News

అసోం మూకదాడి కేసులో 20 మందిపై అభియోగాలు

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:43 AM

అసోంలో 2018లో సంచలనం సృష్టించిన నీలోత్పల్‌ దాస్‌, అభిజిత్‌ నాథ్‌ అనే ఇద్దరు యువకులపై మూక దాడి జరిపి హత్య చేసిన కేసులో 20 మందిపై అభియోగాలను ..

అసోం మూకదాడి కేసులో 20 మందిపై అభియోగాలు

గువాహతి, ఏప్రిల్‌ 21 : అసోంలో 2018లో సంచలనం సృష్టించిన నీలోత్పల్‌ దాస్‌, అభిజిత్‌ నాథ్‌ అనే ఇద్దరు యువకులపై మూక దాడి జరిపి హత్య చేసిన కేసులో 20 మందిపై అభియోగాలను కోర్టు నిర్ధారించింది. మరో 25 మందిపై తగిన సాక్ష్యాధారాలు లేవని ఆరోపణలను కొట్టివేసింది. నాగాం జిల్లా, సెషన్స్‌ కోర్టు సోమవారం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. నిందితులకు ఈ నెల 24న శిక్ష ఖరారు చేయనుంది. అయితే, బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. 45 మంది నిందితుల్లో సగం మందిని వదిలేశారని పేర్కొన్నాయి. నిందితులకు ఉరి శిక్ష వేయాలని కోరాయి. నీలోత్పల్‌, అభిజిత్‌ పిల్లల్ని ఎత్తుకుపోయేవారని సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో ఆనాడు వారిపై మూకదాడి జరిగింది.

Updated Date - Apr 22 , 2026 | 03:43 AM