కుకీ, హమర్ వేర్పాటువాద తెగలతో అసోం ఒప్పందాలు
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:41 AM
ఈశాన్య రాష్ట్రాల్లో హింసను శాశ్వతంగా అంతం చేసే దిశగా వేర్పాటువాద సాయుధ తెగలతో అసోం ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కుకీ, హమర్ గ్రూపులతో తుది శాంతి ఒప్పందాలను చేసుకుంది.
గువహటి, మార్చి 15: ఈశాన్య రాష్ట్రాల్లో హింసను శాశ్వతంగా అంతం చేసే దిశగా వేర్పాటువాద సాయుధ తెగలతో అసోం ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కుకీ, హమర్ గ్రూపులతో తుది శాంతి ఒప్పందాలను చేసుకుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో జాతి సంఘర్షణల యుగం ముగిసి అభివృద్ధి యుగం ప్రారంభమైందని అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఒప్పందాలపై సంతకం చేసిన గ్రూపుల్లో మూడు కుకీ, ఒక హమర్ గ్రూపు ఉన్నాయి. వాస్తవానికి 2012లోనే నాటి కేంద్ర హోం మంత్రి, అసోం ముఖ్యమంత్రి సమక్షంలో ఈ గ్రూపుల సభ్యులు తమ ఆయుధాలను వీడారు. తాజా ఒప్పందం ప్రకారం కుకీ, హమర్ తెగల సంక్షేమానికి మండళ్లు ఏర్పాటు చేస్తారు. గువహటిలో వీటి ప్రధాన కార్యాలయాలుంటాయి. ఈ మండళ్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారు.