Supreme Court: ఖర్చుల లెక్కలడగడం భార్యను వేధించినట్టు కాదు
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:41 AM
ఇచ్చిన సొమ్మును ఏవిధంగా ఖర్చు చేశావని భార్యను భర్త అడగడం క్రూరత్వం కిందికి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని ఆధారంగా కేసు పెట్టలేమని తెలిపింది...
సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, జనవరి 2: ఇచ్చిన సొమ్మును ఏవిధంగా ఖర్చు చేశావని భార్యను భర్త అడగడం క్రూరత్వం కిందికి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని ఆధారంగా కేసు పెట్టలేమని తెలిపింది. ఇలాంటి లెక్కలు అడుగుతున్న భర్తపై కేసుపెట్టాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు చెందిన ఓ జంట కుటుంబ వివాదాల కారణంగా వేరువేరుగా ఉంటోంది. పోషణ నిమిత్తం ఆయన ఆమెకు డబ్బులు పంపిస్తున్నాడు. వీటి లెక్కలు చూపించాలని అతడు కోరగా, అలా అడిగి డామినేట్ చేయడం క్రూరత్వం కిందికి వస్తుందంటూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో భర్తపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై భర్త సుప్రీంకోర్టుకు వెళ్లాడు.