Share News

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా అశోక్‌కుమార్‌ లాహిరి

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:09 AM

దేశ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన నీతి ఆయోగ్‌ను కేంద్రప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. పశ్చిమబెంగాల్‌లో...

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా అశోక్‌కుమార్‌ లాహిరి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): దేశ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన నీతి ఆయోగ్‌ను కేంద్రప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే, కేంద్రప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ లాహిరిని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా నియమించింది. పూర్తిస్థాయి సభ్యులుగా ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌, క్యాబినెట్‌ మాజీ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ప్రముఖ శాస్త్రవేత్తలు కె.వి.రాజు, డాక్టర్‌ గోబర్ధన్‌ దాస్‌, కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యదర్శి అభయ్‌ కరందీకర్‌లను నియమించింది. ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నీతి ఆయోగ్‌ సభ్యులుగా నియమితులైనవారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అశోక్‌కుమార్‌ శనివారం మోదీని కలిశారు.

Updated Date - Apr 26 , 2026 | 04:09 AM