Share News

ఆశాభోస్లేకు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:17 AM

భారత సంగీత శిఖరం, దిగ్గజ గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. సోమవారం సాయంత్రం ముంబైలోని...

ఆశాభోస్లేకు కన్నీటి వీడ్కోలు

  • ముంబైలోని శివాజీపార్క్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

ముంబై, ఏప్రిల్‌ 13: భారత సంగీత శిఖరం, దిగ్గజ గాయని ఆశాభోస్లే అంత్యక్రియలు వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో అధికార లాంఛనాలతో ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పించారు. బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రి నుంచి ఆశాభోస్లే పార్థివ దేహాన్ని లోయర్‌ పరేల్‌లోని ఇంటికి తరలించారు. అక్కడ ఆమె భౌతికకాయాన్ని జాతీయ పతాకంతో కప్పి అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే, బాలీవుడ్‌ నటులు అమీర్‌ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, గాయని శ్రేయా ఘోషల్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఆయన భార్య అంజలి, క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌తో పాటు పలు రంగాల ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. అనంతరం భారీ జనసందోహం నడుమ శివాజీ పార్క్‌ వరకు ఆశాభోస్లే అంతిమ యాత్ర సాగింది. సాయంత్రం శివాజీపార్క్‌లోని శ్మశానవాటికలో తల్లి చితికి కుమారుడు ఆనంద్‌ భోస్లే నిప్పంటించారు.

Updated Date - Apr 14 , 2026 | 04:17 AM