కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:43 AM
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తమకు రూ.7 కోట్లు ఇవ్వాలని..
మొహాలీ, నవంబరు 12: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తమకు రూ.7 కోట్లు ఇవ్వాలని, లేదంటే కేజ్రీవాల్‌తోపాటు ఆయన కూతురు హర్షితా కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్‌కు ఆగంతకుడు ఫోన్ చేయడంతోపాటు వాట్సా్‌పకు మెసేజ్ కూడా పంపించాడు. దీనిపై జర్నైల్‌సింగ్ మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకొంటూ ఓ వ్యక్తి తనకు ఈ బెదిరింపు కాల్, వాట్సాప్ మెసేజ్ చేశాడని తెలిపారు.