కాంగ్రెస్ పరువు నష్టం దావాలో అర్నబ్‌కు సమన్లు
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:18 AM
కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో రిపబ్లికన్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి మంగళవారం ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 17: కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో రిపబ్లికన్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి మంగళవారం ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. తుర్కియేలోని ఇస్తాంబుల్ కాంగ్రెస్ సెంటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమని 2025 మే 15న తప్పుడు కథనాన్ని ప్రసారం చేశారంటూ ఆయనపై దావా నమోదయింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడి సందర్భంగా దీన్ని ప్రసారం చేసి, తమ ప్రతిష్ఠకు నష్టం కలిగించారంటూ కాంగ్రెస్ ఈ దావా వేసింది. ఈ కథనం ప్రచారం చేయకుండా తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ... తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. సమాధానం ఇవ్వాలని అర్నబ్‌కు సమన్లు జారీ చేసి, తదుపరి విచారణను మే 19కి వాయిదా వేశారు.