Share News

బలపడుతున్న ‘అర్నబ్’.. ఈ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం..!

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:51 PM

అర్నబ్ తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో ఏపీతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, యూపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.

బలపడుతున్న ‘అర్నబ్’.. ఈ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం..!
Arnab cyclone

ఇంటర్నెట్ డెస్క్: బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాను అంతకంతకూ బలపడుతోంది. అక్టోబర్ 28న ఏపీలో బాపట్ల, విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో సగటున గంటకు 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో ఏపీతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, యూపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.


ఏపీ: భారత వాతావరణ శాఖ ప్రకారం, అక్టోబర్ 27, 28 తేదీల్లో ఏపీలో పలు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాలో ఈ నెల 29న భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అక్టోబర్ 27న దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశాలో అక్టోబర్ 27, మరికొన్ని జిల్లాల్లో అక్టోబర్ 29న భారీ వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్: దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో అక్టోబర్ 27న భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 28న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో అక్టోబర్ 29 వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


తెలంగాణ తుర్పు ప్రాంతాల్లో కూడా అక్టోబర్ 28న కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్: అక్టోబర్ 29న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 30న కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది.

పశ్చిమ బెంగాల్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

మీ బాధను అర్థం చేసుకుంటా.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్ హామీ

హోటల్ గదిలో నవవధువు మృతి.. వైరల్ అవుతోన్న వీడియో


ఈ వార్తలనూ చదవండి:

‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన

మీ బాధను అర్థం చేసుకుంటా.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్ హామీ

Updated Date - Oct 26 , 2026 | 05:49 PM