సివిల్స్ టాపర్‌కు 52.88 శాతం మార్కులు
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:15 AM
సివిల్స్ పరీక్షల టాపర్ అనుజ్ అగ్నిహోత్రికి 52.88 శాతం మార్కులు వచ్చినట్టు మంగళవారం యూపీఎస్సీ ప్రకటించింది.
న్యూఢిల్లీ, మార్చి 10: సివిల్స్ పరీక్షల టాపర్ అనుజ్ అగ్నిహోత్రికి 52.88 శాతం మార్కులు వచ్చినట్టు మంగళవారం యూపీఎస్సీ ప్రకటించింది. మెయిన్ రాత పరీక్షకు 1,750 మార్కులు, ఇంటర్వ్యూకు 250 మార్కులు కేటాయించి మొత్తం 2,025 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అనుజ్‌కు మెయిన్స్‌లో 867, ఇంటర్వ్యూలో 204 మార్కులు వచ్చాయి.. మొత్తంగా 1,071 మార్కులు సంపాదించి 52.88 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన రాజేశ్వరి సుర్వేకు 52.69 శాతం, మూడో స్థానం పొందిన ఆకాంక్ష్‌కు 52.19 శాతం మార్కులు వచ్చాయి.