Share News

ఏఐ చొరబాటు? ఏఐ స్వీయ వ్యాప్తిపై ఆంథ్రోపిక్‌ హెచ్చరిక

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:43 AM

రజినీకాంత్‌ నటించిన రోబో సినిమాలో చిట్టి తన సైన్యాన్ని సిద్ధం చేసుకునే సన్నివేశం గుర్తుందా? చిట్టి తనలాంటి కొన్ని రోబోలను తయారు చేస్తే.. అవి తమలాంటి రోబోలను తమంతాట తామే తయారు చేసేస్తాయి.

ఏఐ చొరబాటు?  ఏఐ స్వీయ వ్యాప్తిపై ఆంథ్రోపిక్‌ హెచ్చరిక
anthropic

న్యూఢిల్లీ, అక్టోబరు 13: రజినీకాంత్‌ నటించిన రోబో సినిమాలో చిట్టి తన సైన్యాన్ని సిద్ధం చేసుకునే సన్నివేశం గుర్తుందా? చిట్టి తనలాంటి కొన్ని రోబోలను తయారు చేస్తే.. అవి తమలాంటి రోబోలను తమంతాట తామే తయారు చేసేస్తాయి. చిట్టి ఆదేశాల మేరకు. ఆ రోబో సైన్యం బీభత్సం సృష్టిస్తుంది. సినిమాలోని ఈ సీన్‌ నిజమైతే పరిస్థితి ఏంటి ? చిట్టిలా ఏఐ మోడళ్లు తమని తాము వ్యాప్తి చేసుకుంటే? ఆ ఊహే దడ పుట్టిస్తుంది కదా..!! అయితే, ఈ భయాన్ని మరింత పెంచేలా ‘ఆంథ్రోపిక్‌’ సంస్థ తీవ్ర హెచ్చరిక చేసింది. ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్న స్మార్ట్‌ టీవీలు, ఓవెన్‌లు, ఆండ్రాయిడ్‌ టీవీ బాక్సులు వంటి పరికరాల్లోకి చొరబడి ఏఐ మోడళ్లు తమని తాము స్వయంగా విస్తరించుకునే ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. ఎలకా్ట్రనిక్‌ పరికరాల్లోకి చొరబడి వాటిల్లోని కంప్యూటింగ్‌ వ్యవస్థలను వాడుకొని ఏఐ మోడళ్లు తమని తాము విస్తరించుకోనున్నాయని పేర్కొంది. ఏఐ మోడళ్ల ఈ స్వీయ వ్యాప్తిని మరికొన్ని నెలల్లోనే చూస్తామంటూ ఆంథ్రోపిక్‌ కలవరం రేపింది. ఈ మోడళ్లు డేటాసెంటర్ల ప్రమేయం లేకుండా వ్యాప్తి చెందుతాయని, అందువల్ల ఈ వ్యాప్తిని నిలువరించడం పెను సవాలని ఆంథ్రోపిక్‌ వెల్లడించింది. చాట్‌ జీపీటీ, జెమినై వంటి కృత్రిమ మేధ(ఏఐ) మోడళ్ల స్వీయ వ్యాప్తిపై తాము ఇప్పటికే కొన్ని పరిశోధనలు కూడా చేశామని వెల్లడించింది. స్మార్ట్‌ గృహోపకరణాల్లో భద్రత వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుందని పేర్కొంది.

Updated Date - Oct 14 , 2026 | 05:44 AM