Share News

‘మూడో భాష’ ఇప్పుడే వద్దు: అన్నామలై

ABN , Publish Date - May 27 , 2026 | 03:57 AM

ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషలు తప్పనిసరి చేస్తూ జారీచేసిన కొత్త నోటిఫికేషన్‌ను కేంద్ర విద్యాశాఖ...

‘మూడో భాష’ ఇప్పుడే వద్దు: అన్నామలై

చెన్నై, మే 26 (ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషలు తప్పనిసరి చేస్తూ జారీచేసిన కొత్త నోటిఫికేషన్‌ను కేంద్ర విద్యాశాఖ తక్షణమే ఉపసహరించుకోవాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై డిమాండ్‌ చేశారు. ‘‘సీబీఎస్ఈ ప్రకటనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు దిగ్ర్భాంతికి గురయ్యారు. అతి తక్కువ కాలంలోనే విద్యార్థులు మూడవ భాషను తప్పనిసరిగా అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే మూడు భాషలు తప్పనిసరి విధానాన్ని సీబీఎస్ఈ ఉపసంహరించుకోవాలి. గతంలో ప్రకటించినట్లుగా.. ఈ మూడు భాషల విధానం ఆరవ తరగతి నుంచే వర్తించేలా 2029-30 విద్యా సంవత్సరం నుంచి అమలుచేసేలా చర్యలు చేపట్టాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 27 , 2026 | 03:57 AM