Share News

అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లను

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:48 AM

సుప్రీం కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని, అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ (అడాగ్‌) ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్న రూ.40వేల కోట్ల బ్యాంకింగ్‌...

అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లను

  • సుప్రీం కోర్టుకు తెలియజేసిన అనిల్‌ అంబానీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సుప్రీం కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని, అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ (అడాగ్‌) ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్న రూ.40వేల కోట్ల బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ మోసంపై ఏజెన్సీల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఈమేరకు అత్యున్నత న్యాయస్థానం ముందు ఆయన అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ నెల 26న తమ ముందు హాజరుకావాలని ఈడీ తనకు సమన్లు జారీ చేసిందని, ఆ తేదీన విచారణకు హాజరుకానున్న ట్టు అఫిడవిట్‌లో తెలిపారు. మాజీ అధికారి ఈఏఎస్‌ శర్మ దాఖలు చే సిన ఓ పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలైంది.

Updated Date - Feb 20 , 2026 | 02:48 AM